కారేపల్లిలో వాహనాల తనిఖీ చేసిన సీఐ తిరుపతిరెడ్డి
అక్షర విజేత కారేపల్లి:
కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్డులో మంగళవారం కారేపల్లి రూరల్ సీఐ బి . తిరుపతి రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి పలు వాహనాలను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఖ మ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిలో గల కారేపల్లి క్రాస్రో డ్డులో కారేపల్లి, కామేపల్లి మండలాలకు సంబంధించి పోలీసు చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సీఐ తిరుపతిరెడ్డి తో పాటు తనిఖీ స్నెషల్ స్క్వాడ్ అధికారులు ముమ్మరంగా తని ఖీలు నిర్వహించారు. రూ.50వేలకంటే అధికంగా నగదు తీ సుకవేళ్లితే వారి వాహనాలను సీజ్ చేయండంతోపాటు కేసులు నమోదు చేస్తామని సీఐ తిరుపతిరెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు హెచ్చరించారు.