గద్వాల జిల్లా వాసి సుధారాణికి డాక్టరేట్
జన్యు శాస్త్రంలో పరిశోధనలకు గాను సుధారాణికి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం.
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
జోగులాంబ గద్వాల జిల్లా మేలచెర్వు గ్రామం భాగ్యమ్మ, ఏసేపుల రెండో కుమార్తె కాశపోగు సుధారాణి ఉస్మానియా యూనివర్సిటీలోని జన్యు శాస్త్ర విభాగంలో క్యారెక్టర్రైజేషన్ ఆఫ్ ఫైటో ఎక్స్ట్రాక్ట్ ఫర్ యాంటీ ఏపీలెప్టిక్ యాక్టివిటీ ఆఫ్ అకాలిఫా ఇండికా అనే అంశంపై పరిశోధన జరిపినందుకుగాను డాక్టరేట్ ప్రధానం చేశారు. ఔషధ మొక్కల ప్రాముఖ్యత, మూర్చ వ్యాధిని తగ్గించుటలో వాటి ప్రాధాన్యతలపై పరిశోధనలు చేసి, వాటిని మూర్చ వ్యాధి వచ్చిన ఎలుకలపై ప్రయోగించి జన్యుపరమైన మార్పులు గమనించినట్లు సుధారాణి తన పరిశోధన గ్రంథంలో సమర్పించినది అందుకుగాను ఉస్మానియా యూనివర్సిటీ కాశపోగు సుధారాణికి డాక్టరేట్ ప్రకటించింది.సుధారాణికి డాక్టరేట్ రావడం వల్ల పరిశోధన విద్యార్థులు, తల్లిదండ్రులు,బంధుమిత్రులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా సుధారాణి తన పరిశోధనలకు సహకరించిన ప్రొఫెసర్ రోజా రాణి, పరిశోధక విద్యార్థులకు తన చదువులో ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.