నాన్చుడు దోరణితో కాంగ్రెస్ పార్టీకి నష్ఠమెనా…?
—ఖరారు కాని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి
—నాయకులు, కార్యకర్తల్లో అయోమయం
—రెండు వారల క్రితమే ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్డ్ విడుదలైన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పార్లమెంట్ అభ్యర్థిని ఇప్పటికి ప్రకటించకపోవడంతో నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురువుతున్నారు. ఈ నాన్చుడు దోరణి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్ఠం చేకురుస్తుందని ఆ పార్టీకి చెందిన నాయకులే పేర్కొంటున్నారు. అందుకు నిదర్శనం ఇటివలే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వారాల ముందు నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గ అభ్యర్థిగా షబ్బీర్ అలీ పేరును ప్రకటించగా, ప్రచారానికి సమయం లేకపోవడంతో అన్ని డివిజన్ లలో నామమాత్రంగా ప్రచారాన్ని నిర్వహించి చివరకి ఓటమిని చవిచూసారు. అదే సీన్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో పునరవృతం అవుతుంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పది రోజుల క్రితమే తమ అభ్యర్థులను ప్రకటించగా ప్రచారాన్ని ముమ్మరం చేసారు. కాని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేకపోతుంది. ఒక దశలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖారారు అయిందని ప్రచారం జరిగింది. ఇప్పుడు సామాజిక సమీకరణల పేరుతో అభ్యర్థిని ప్రకటించడంలో తత్సరం చేస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ వీప్ ఈరవత్రి అనిల్, డి.సంజయ్ తదితరులు ధరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. చివరికి పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్లను ముందు వరుసలో చేర్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు మొగ్గు చోపి పార్టీ అదిష్ఠానానికి సిఫారసు చేసారు. అయిన కాంగ్రెస్ పార్టీ వేచి చూసే దోరణి అవలంబిస్తుంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్లమెంట్ కు పోటి చేసేందుకు టిక్కేట్ కోసం కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోనే పనిలో ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచ ధర్మపూరి అరవింద్ బరిలో ఉన్నారు. వీరిద్దరు కాపు (బీసీ) సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కాంగ్రెస్ పార్టీ అదే సమాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలుపాలని బావిస్తున్నట్లు తెలుసుంది. అందులో బాగంగానే నాన్చుడు దోరణి అవలంబిస్తున్నట్లు తేలుస్తుంది. ఈ నెల 16న పార్లమెంట్ ఎన్నికలకై ఎన్నికల సంఘం షెడ్యూల్డ్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని ప్రకటించడంలో ఇంక వడపోత కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నాయకులు, కార్యకర్తలు నిజామాబాద్ పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో ఏలాగైన ఎంపీ స్థానాన్ని చేిక్కంుకోవాలనే పట్టుదలతో ఉంది. కాని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వైఖరితో శ్రేణులు అయోమయంలో ఉన్నారని చెప్పక తప్పదు. దేశంలో మోడి హవా కొనసాగుతుందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపూరి అరవింద్ జిల్లాలో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ అభ్యర్థిత్వన్ని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇంక ఆయన ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. అందుక కారణం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత డీలా పడ్డారనే చెప్పాలి. దాంతో బీఆర్ఎస్ ఇంకా ప్రచారాన్ని మొదలు పెట్టకపోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్ అధిష్ఠానం పార్టి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ప్రచారాన్ని మొదలు పెట్టలేదు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ ఈ వారంలో అభ్యర్థిని ప్రకటిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.