
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కలెక్టర్ కార్యాలయములో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరములో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి షేక్ రసూల్ బీ ఆధ్వర్యములో పోషణ్ పక్వాడా సమన్వయ సమావేశము ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్ హాజరయ్యారు. పోషణ పక్వాడా సందర్బముగా మార్చి 9వ తేదీ నుండి మార్చి 23వ తేదీ వరకు అంగన్వాడి కేంద్ర స్థాయి, మండల స్థాయి, ప్రాజెక్ట్ స్థాయిలో జరిగిన కార్యక్రమాలను, ఎస్ఎఎం, ఎంఎఎం పిల్లలకు అందిస్తున్న సేవల యొక్క వివరాలను, అంగన్వాడి కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి సమీక్ష నిర్వహంచారు. ఈ సమావేశములో జిల్లా స్థాయి అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి సుదర్శనం, సమగ్ర శిక్షా అభియాన్ సేక్తోరల్ అధికారి శ్రీనివాస్, జిల్లా వెనుక బడిన తరగతుల శాఖా సహాయ అధికారి టీ.కిషన్, జిల్లా గిరిజన సంక్షేమాదికారి నాగరావ్, మిషన్ భగీరథ ఎక్స్ క్యుటివ్ ఇంజనీర్ రాకేశ్, ఆయుష్ డిపార్ట్మెంట్ కో ఆర్డినేటర్ యస్.రాంమొహన్, జిల్లా పంచాయతీ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మండల స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, ఐకేపి, ఏపియంలు మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో లు, సూపర్ వైజర్ లు, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.