డిసిసిబి చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
—రైతుల సంక్షేమానికి పాటుపడతా
—బ్యాంకును లాభాల బాటలో తీసుకువస్తా
—డైరెక్టర్లకు అందుబాటులో ఉంటా
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. ఈ మెరకు డీసీఓ శ్రీనివాస్ రావు నియమక పత్రాన్ని చైర్మన్ రమేష్ రెడ్డికి డిసిసిబి కార్యాలయంలో అందజేసారు. మంగళవారం డిసీసీబి బ్యాం కులో చైర్మన్ ఎన్నికపై పాలక వర్గ సమావేశం నిర్వహించారు. చైర్మన్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో ఎట్టకేలకు చైర్మన్ గా కుంట రమేష్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడతానని, బ్యాంకు ని లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. మార్చ్ 21 న అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి ఖాళీ అయిదని, దాంతో మంగళవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించబడిందన్నారు. డీసీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చైర్మన్ పదవికి కుంట రమేష్ రెడ్డి ఒక్కరే నాలుగు సెట్లు నామినేషన్ వేశారని, నామినేషన్ ఒక్కరే వేయడంతో కుంట రమేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రమేష్ రెడ్డికి నియాక పత్రాలు అందజేశామని అన్నారు. పాలక వర్గం 20 మంది కి గాను 17 మంది హాజరు అయ్యారని అన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ రెడ్డికి పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ 21న అవిశ్వాసం నెగ్గడంతో మంగళవారం నా మీద నమ్మకం తో డైరెక్టర్లు సహకరించి నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు డైరెక్టర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్ లకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞత లు తెలిపారు. జిల్లా రైతన్నలకు తన సహకారం ఉంటుందని, రైతులకు, డైరెక్టర్లకు ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి తోడ్పడు తానని అన్నారు. సహచర డైరెక్టర్లకు హృదయ పూర్వక అభినందనలు తెలుపుతు న్నామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కుంట రమేష్ రెడ్డి అభిమానులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.