బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ అను నేను
ఒక్క అవకాశం ఇవ్వండి
మోదీ ఆశీస్సులతో అభివృద్ధి చేసి చూపిస్తాను.
కాంగ్రెస్ అబద్దాల ఆరు గ్యారెంటీలు
బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి
బీజేపీ వనపర్తి అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన లక్ష్మీ కృష్ణ గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ బిజెపి అభ్యర్థిగా భరత్ అను నేను నాగర్కర్నూల్ అభివృద్ధి పరుస్తానని బిజెపి అభ్యర్థిగా ఒక అవకాశం ఇవ్వాలని కోరారు కేంద్రంలో మరొకసారి మోడీ ప్రభుత్వం లక్ష్యంగా మరియు బిజెపి లక్ష్యమైన 400 సీట్లలో నాగర్ కర్నూల్ పార్లమెంటు ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందని, బిజెపి గెలిస్తే దేవరకొండ గద్వాల రైల్వే లైను సాధిస్తానని, వనపర్తి పట్టణం మీదుగా జాతీయ రహదారి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు యువతకు ఉపాధి లక్ష్యంగా మోడీ ఆశీస్సులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని పేర్కొన్నారు పార్లమెంటు సభ్యులు పి రాములు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా శాసన సభ్యునిగా మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ఎక్కడ కూడా ఒక రూపాయి కొరకు చేయి చాచలేదని అవినీతికి ఆస్కారం లేని ప్రజాసేవ లక్ష్యంగా పనిచేశానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో దేశ సేవ చేయడానికి బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ అను నేను మీ ముందుకు వస్తున్నారని పెద్ద మనసుతో అందరూ దీవించి పార్లమెంటు సభ్యునిగా అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు.జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ 6 గ్యారంటీల మాటున 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక హామీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కష్టాలు వస్తాయని, అవినీతి రాజ్యమేలుతుందని, నిన్న హైదరాబాదులో హోలీ పండుగ సందర్భంగా హోలీ ఆడుతున్న బంజారా కమ్యూనిటీకి చెందిన ప్రజలను ఒక వర్గం వారు అకారణంగా దాడి చేయడం కాంగ్రెస్ సంస్కృతిని గుర్తు చేస్తుందని హైదరాబాదు నియోజకవర్గంలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత గెలుస్తున్నారని అక్కసుతో కాంగ్రెస్ అండతో మజిలీస్ గుండాల దాడిని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని ఈ దాడికి ప్రతిఫలం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధివైపు అడుగులు వేయాలని అశాంతికి కారణమైన వారిని వారిపై చర్య తీసుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి డి సి సి బి డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి రాష్ట్ర గిరిజన మోర్చా నాయకులు మంగ్యా నాయక్ గద్వాల జిల్లా అధ్యక్షులు పి రామచంద్రారెడ్డి నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఇల్లేని సుధాకర్ రావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి డా. ఏ. రాజ వర్ధన్ రెడ్డి మున్నూరు రవీందర్ మెంటపల్లి పురుషోత్తం రెడ్డి బి శ్రీశైలం శ్రీమతి జ్యోతి రమణ అక్కల రామన్ గౌడ్ కే మాధవరెడ్డి కుమారస్వామి సీతారాములు వెంకటేశ్వర్ రెడ్డి శ్రీమతి సుమిత్రమ్మ గౌన్ హేమారెడ్డి బాశెట్టి శ్రీనివాసులు విష్ణువర్ధన్ రెడ్డి చిత్తారి ప్రభాకర్ దాసరాజు ప్రవీణ్ బచ్చు రాము పెద్దిరాజు చెన్నయ్య మనివర్ధన్ గొర్ల బాబురావు బోయల రాము బుచ్చిబాబు గౌడ్ రాజశేఖర్ గౌడ్ శ్రీమతి అశ్విని రాధ శ్రీమతి కల్పన కదిరే మధు కొమ్ము సామేలు తదితరులు పాల్గొన్నారు.