
అక్షర విజేత. మరికల్/ ధన్వాడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గల, సర్వే నంబర్ ఒకటి లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలంటూ మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని మండల తాసిల్దార్ కార్యాలయం ముందు మరికల్ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వం భూములు మాయమైపోతున్న సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ అఖిలపక్ష నాయకులు బెలగొంది వీరన్న,జి. కృష్ణయ్య, శ్రీకాంత్ రెడ్డి, పి.రాఘవేందర్, పి.రామకృష్ణ,మరికల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాటేకొండ ఆంజనేయులు,జి.రాజేష్, పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్, బిజెపి నాయకులు ఎం.వేణుగోపాల్,లు ఆరోపించారు. పలుమార్లు మండల తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు.వెంటనే కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని మండల తాసిల్దార్ సునీతను నాయకులు కోరారు. అనంతరం ధర్నా చేస్తున్న విషయాన్ని, తెలుసుకున్న మరికల్ ఎస్సై మురళి, సందర్శించి ఆందోళనకారులతో మాట్లాడారు.అనంతరం వినతి పత్రాన్ని అఖిలపక్ష నాయకులు మండల తాహసిల్దార్ కు అందజేశారు, ఈ విషయమై మండల తాహసిల్దార్ మాట్లాడుతూ తగు చర్యలు తీసుకుంటామని,అఖిలపక్ష నాయకులకు హామీ ఇచ్చారు.