చోర్ మచాయే శోర్ …
. . . ఉల్టా చోర్ కోత్వాల్ కు ఢాటే
. . . మోటు ఔర్ ఫత్లూ కీ జోడీ ...
. . . భూకబ్జాదారుల్లో ఇద్దరి పేర్లు ఒక్కటే
. . . మోసపోతున్న అమాయకులు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : ఉల్టాచోర్ కొత్వాల్ కు ఢాటే … అన్నచందంగా మారింది భూకబ్జాదారుల పరిస్థితి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా తమ పేరును కబ్జాదారుల్లోలేదని ప్రజలను నమ్మించేందుకు కబ్జాదారుల్లోఒకరు ఏకంగా ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా రెవెన్యూ శాఖ అధికారులను కలిసి భూకబ్జాదారులకు తమకూ ఏలాంటి సంబంధం లేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. జిల్లా కేంద్రం శివారుప్రాంతంలో ఇటీవల జోరుగా సాగుతున్న భూకబ్జాలపై ఎవరికి వారే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ భూకబ్జాదారుల్లో ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో నేను కాదంటే నేను కాదని వారు ప్రజలను నమ్మిస్తున్నారు. వీరి చేతుల్లో మోసపోయిన అమాయక ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భూకబ్జాలపై ఫిర్యాదులు రావడంతోనే ముందస్తుగా అధికారులను తప్పుదోవ పట్టించేందుకు కోర్టులను ఆశ్రయించినట్లు నమ్మిస్తున్నారు. పైగా వీరికి అండగా ఉన్నఓప్రజాప్రతినిధి ద్వారా సంబంధిత అధికారులకు సైతం ఫోన్ల ద్వారా ఆదేశాలు ఇప్పిస్తున్నారు.
అధికార పార్టీప్రజాప్రతినిధులతో తమకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లుగా ఫోటోలు దిగి వాటిని ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు సైతం తమఅనుచరులుగా భావించి ఫొటోలు దిగుతుండగా వీరు చేసే అక్రమవ్యవహారాలను గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు సైతం ఎవరు మంచి కార్యకర్త, తమకు అనుకూలంగా ఉన్నఅనుచరులోగుర్తించలేక అభాసుపాలవుతున్నారు.