ట్విట్టర్ (x)ద్వారా అసత్య ప్రచారం
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు… ఎస్ఐ గోవర్దన్
అక్షర విజేత:నల్లబెల్లి,
నల్లబెల్లి పోలీసులను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అతనికి చెందిన @commonman R86322 అనే ట్విట్టర్ (X) అకౌంట్ ద్వారా ఉద్దేశయపూర్వకంగా నల్లబెల్లి పోలీసులు అందరు దొంగలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి అసత్య ప్రచారం చేస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా నల్లబెల్లి పోలీస్ పేరును సమాజంలో కించపరుస్తూన్నా అట్టి వ్యక్తి పై కేసు నమోదు చేయటం జరిగిందనీ అట్టి వ్యక్తిని ద్యర్యాప్తు అనంతరం అరెస్ట్ చేయటం జరుగుతుందనీ అదేవిదంగా ఎవరైనా వ్యక్తులు చట్టాన్ని ఉల్లంగించి,ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలను,రాజకీయ పార్టీలను భయబ్రాంతులకు గురిచేయటానికి,వ్యక్తులను అధికారులను, రాజకీయానేతలను కించపరిచేటట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసినట్లయితే వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నల్లబెల్లి ఎస్ఐ గోవర్దన్ తెలిపారు.