ప్రిన్సిపాల్… సి. హెచ్ లక్ష్మి దేవి.
అక్షర విజేత మర్రిపాడు నెల్లూరు బ్యూరో : 2025-26 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో మండల కేంద్రం లోని మర్రిపాడు కస్తుర్భాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రవేశాలకోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ సి. హెచ్. లక్ష్మి దేవి ఒక ప్రకటనలో తెలిపారు.వీటితో పాటు 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేస్తామన్నారు.
తేది 19-03-2025 నుండి 11-04-2025 వరకు (https://apkgbv.apcfss.in) వెబ్ సైట్లో ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అనాథలు, బడిబయట పిల్లలు, బడిమానేసిన వారు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న బాలికలు ప్రవేశాలకు అర్హులని, ఈ సేవా కేంద్రాలు మరియు గ్రామ సచివాలయాల ద్వారా అప్లై చేసుకొనవచ్చని తెలిపారు ఆన్ లైన్ ధరఖాస్తు చేసుకొనుటకు విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, ప్రస్తుత పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్లవలెను. (అవకాశం ఉన్నవారు ఆదాయ దృవీకరణ పత్రము మరియు కుల దృవీకరణ పత్రములను జత పరచవలెను.
* బడి మానివేసిన బడి వయస్సు ఆడపిల్లలు, అనాధ పిల్లలు, తల్లి/తండ్రి కోల్పోయిన ఆడపిల్లలు సంబంధిత దృవీకరణ పత్రాలను కచ్చితంగాజతపరచవలెనని తెలియజేసారు.
ఉన్నత విద్యార్హతలు, అనుభవం, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులచే విద్యా బోధన.
క్రమ శిక్షణ, ఉత్తమ ఫలితాల సాధనలో “కే .జి .బి .వి ” లు ముందంజలో ఉన్నాయని • అన్ని ప్రభుత్య పధకాలతో పాటు ఉచిత విద్య మరియు వసతి కల్పించబడును. • 6 నుండి 12 తరగతులు వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్య మరియు 8 నుండి 10 వ తరగతులకు సీబీఎస్ సీ సిలబస్లో విద్యాబోధన. ఐ ఎఫ్ పి మరియు టాబ్ ల ద్వారా విద్యాబోధన మరియు భరత్ స్కౌట్ యూనిఫాం. • ప్రతి రోజు యోగా తరగతులతో పాటు, ఆరోగ్య వ్యాయామ విద్య మరియు క్రీడలు మా ప్రత్యేకత.
* “K.G.B.V” లు బాలికలకు అత్యంత సురక్షిత కేంద్రాలని తమ పాఠశాల విశిష్ట త వివరించారు
పూర్తి వివరములకు CH.లక్ష్మీదేవి – ప్రిన్సిపాల్ ఫోన్ 9000850953 చేయగలరని ప్రకటన విడుదల చేసారు.