దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం సర్వసభ్య సమావేశం
అక్షరవిజేత, దేవరకొండ
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శ్రీమార్కండేశ్వర స్వామి దేవాలయంలో అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది పద్మశాలి సంఘం పదవి కాల పరిమితి పూర్తవడంతో సమావేశాన్ని నిర్వహించి గత కమిటీ పురోగతి జమ ఖర్చులను కమిటీ ముందు వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతన కమిటీ ఎన్నిక జనవరి మాసంలో ఏర్పాటు చేయుటకు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నిర్వహణ కమిటీ సభ్యులుగా వనం చంద్రమౌళి, వనం బుచ్చయ్య. పగిడిమర్రి సత్యమూర్తి, అంకం చంద్రమౌళి, రావిరాల వీరయ్య, నాతోపాటు సమన్వయ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమన్వయ కమిటీ సభ్యులుగా గాజులు ఆంజనేయులు,పున్న వెంకటేశ్వర్లు ,పులిపాటి నరసింహ, వనం జగదీశ్వర్ ఏలే యాదయ్య, గాజుల మురళి లను నియమించారు. . ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, గాజుల ఆంజనేయులు,వనం చంద్రమౌళి, పులిజాల శ్రీనివాసులు శ్రీనివాసులు, పున్న వెంకటేశ్వర్లు, ఏలే యాదయ్య, పులిపాటి నరసింహ, వనం జగదీశ్వర్, రావిరాల వీరయ్య, గాజుల రాజేష్, గుర్రం విజయలక్ష్మి, చెరిపెల్లి జయలక్ష్మి, సిరిపోతు శ్రీరాములు, ఉప్పల శ్రీనివాసులు, గాజుల మురళి,పున్న శ్రీనివాసులు, పగిడిమర్రి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు