ములుగు జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన
– పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
అక్షరవిజేత,ములుగు :
ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టారు.ఎటునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని చౌక్ రేంజ్ లో 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ను మంత్రి సీతక్క ప్రారంభించి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.అదేవిధంగా కన్నాయిగూడెం మండలంలోని ఆర్ అండ్ బి రోడ్డు నుండి కొత్తూరు వరకు 120 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు.కన్నాయిగూడెం, ఏటూరు నాగారం మండలాలలో 72 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లా పర్యాటకంగా ఇప్పటికే అభివృద్ధి పదంలో విరజిల్లుతుందని నూతనంగా ఏర్పాటు చేసిన లక్నవరం థర్డ్ ఐలాండ్ కూడా పర్యాటలోని ఆకర్షిస్తుందని ఆమె అన్నారు.ఎటునాగారం పస్రా గ్రామాల మధ్య త్వరలోనే కోటి రూపాయల నిధులతో బ్లాక్ బెర్రీ టూరిజం స్పాట్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారని అన్నారు. ఎన్నో ఔషధ మూలికలు కలిగిన అటవీ ప్రాంతంలో ఇలాంటి బ్లాక్ బెర్రీ టూరిజం స్పాట్ పర్యాటకంగానే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుష్షును సైతం పెంచే విధంగా ఈ బ్లాక్ బెర్రీ టూరిజం స్పాట్ ముస్తాబ్ అవుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్ మహేందర్ జీ, ఆర్డివో వెంకటేష్, కన్నాయిగూడెము ఎమ్మార్వో వేణుగోపాల్, ఏటూరునాగారం ఎమ్మార్వో జగదీశ్, ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.