శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.1.56 కోట్ల విలువైన డాలర్లు స్వాధీనం

  1. ట్రాలీ బ్యాగుల్లోని దుస్తుల మధ్య దాచి తరలింపు

విజేత,రాజేంద్రనగర్ : శంషాబాద్ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో అక్రమంగా తరలిస్తున్న భారీ విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో అత్యంత చాకచక్యంగా దాచి తరలిస్తున్న రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడి కదలికలపై అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. ట్రాలీ బ్యాగ్‌లోని దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లలో దాచి ఉంచిన విదేశీ కరెన్సీ వెలుగు చూసింది. ఆ ప్రయాణికుడి వద్ద రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు గుర్తించారు.అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో మహిళా ప్రయాణికురాలిని కూడా అధికారులు తనిఖీ చేశారు. ఆమె వద్ద రూ.91.94 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

*మొత్తంగా పట్టుబడిన కరెన్సీ వివరాలు*

*యూఎస్‌ డాలర్లు (USD): 1,64,200*

*మలేషియా రింగిట్లు (MYR): 3,773*

*సింగపూర్ డాలర్లు SGB: 2*

ఈ విదేశీ కరెన్సీని తరలించడానికి సంబంధించి ప్రయాణికులు ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు, అనుమతులు చూపించలేకపోయారు. దీంతో అక్రమ రవాణా కోణంలో కేసు నమోదు చేసిన అధికారులు.. విదేశీ కరెన్సీతో పాటు వారు ఉపయోగించిన ట్రాలీ బ్యాగులను సీజ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత విచారణ కొనసాగుతోంది.

Views: 5

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :