*ప్రజలకు రైతుల పొలాలకు పర్యావరణానికి హాని కలిగించే ఫ్యాక్టరీల నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని మద్దతు*
*అలంపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు విజయుడు*
అక్షర విజేత అలంపూర్
ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీని తక్షణమే రద్దు చేయాలని భారీ సంఖ్యలో రైతులు ప్రజలు వారితోపాటు ఎమ్మెల్యే కూడా నిరసన వ్యక్తం చేశారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామ శివారు పరిధిలో ప్రజలకు ప్రజా జీవనానికి హాని కలిగించే ఇథనాల ఫ్యాక్టరీను నిర్మించే ఆలోచన ఉపసంహరించుకోవాలని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయుడు నిరసన వ్యక్తం చేశారు జోగులాంబ గద్వాల జిల్లా బి.ఆర్.ఎస్.వి.కో ఆర్డినేటర్ కురువ పల్లయ్య అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని పొలాలకు మరియు ప్రజలకు ప్రాణానికి ఫ్యాక్టరీని తక్షణమే రద్దు చేయాలి ఈ ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల గాలి నీరు మరియు ప్రజలు తినే ఆహారం కలుషితం అవుతుందని దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఈ గ్రామంలో రైతులు పండించే పచ్చని పైర్లు నల్ల రేగడి భూముల బీడులు బారి వ్యవసాయానికి పనికి రాకుండా పొలాలు పోతాయని ఆయన అన్నారు.స్థానికంగా ప్రజా సేకరణ ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ శివారి పరిధిలో పరిశ్రమ యజమాన్యం ఇట్టి ఫ్యాక్టరీని నిర్మించుటకు సరైనది కాదని కనీసం గ్రామపంచాయతీ అనుమతి కూడా లేకుండా నిర్మించడం సరి కాదని పరిశ్రమ నిర్మాణం కోసం సేకరించిన భూమికి అనుకుని గత ప్రభుత్వం హయాంలో దళితులకు ఇచ్చిన మూడెకరాల భూమి 156ఎకరాలు ఉన్నదని ఆ భూమిలో దళితులంతా సాగులో ఉన్నారని పంటలు వేశారని ఆ భూమి మొత్తం కాలుష్యానికి గురవుతుందని అలాగే 2009సంవత్సరం వరదల సందర్భంగా చిన్న ధన్వాడ గ్రామం ముప్పుకు గురైన సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు ఇంటి స్థలాల కొరకు సేకరించిన భూమి కూడా పరిశ్రమకు సేకరించి భూమికి ఆనుకొని ఉన్నదని ఇలాంటి చోట ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రజల ఇబ్బందులను గమనించకుండా ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా పరిశ్రమ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు రైతులకు ప్రజా జీవనానికి హాని కలిగించే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం సరి కాదని ప్రభుత్వం ప్రజా శ్రేయస్ కోసం పనిచేయాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకోవడం సరి కాదని అన్నారు అలంపూర్ నియోజకవర్గ ప్రజలని కాపాడుకోవడం నా బాధ్యత అని అలంపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే విజయుడు ఈ కార్యక్రమంలో అయిజ మండల బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు వీరేష్ చిన్న దన్వాడ నారాయణ నసన్నూరు లక్ష్మన్న పెద్ద ధన్వాడ జయరాం రెడ్డి హనుమంత్ రెడ్డి మోహన్ రావు అలెగ్జాండర్ నాగరాజు మాచర్ల శ్రీనివాసులు పరమేష్ పెద్ద ధన్వాడ ఈరన్న గౌడ్ పరమేశ్వర్ గౌడ్ మొదలగు గ్రామ పెద్దలు రైతులు తదితరులు పాల్గొన్నారు.