Tuesday, April 8, 2025
spot_img

రైతులందరూ ప్రభుత్వ పరిమిషన్ ఉన్న డీలర్ షాపులలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. * రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి.

రైతులందరూ ప్రభుత్వ పరిమిషన్ ఉన్న డీలర్ షాపులలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి.

* రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి.

 

అక్షరవిజేత,శంకర్ పల్లి

శంకర్ పల్లి మండలంలో గురువారం రోజున పచ్చి రొట్ట ఎరువుల సరఫరా చేసే ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.గీతారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం శంకర్ పల్లి మండలం కు సంబంధించి 140 క్వింటాళ్ల పచ్చి రొట్టె ఎరువులు సరఫరా చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 262 క్వింటాళ్ల జనుము, జిలుగలు రైతులకు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా మండలంలోని రైతులందరూ ప్రభుత్వ పర్మిషన్ ఉన్న డీలర్ షాపులలో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. మండలంలో రైతులకు పత్తి విత్తనాలు సరిపడా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి, మండల వ్యవసాయ అధికారి పి.సురేష్ బాబు, ఏ ఈ ఓ లు ఏ.రామకృష్ణారెడ్డి, జి.రమ్య, డి.మౌనిక, షీల, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles