89వ వార్డులో జోరు మీద ఉన్న గణబాబు ప్రచారం
అక్షర విజేత గోపాలపట్నం:: లీటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 89వ వార్డు పరిధి గోపాలపట్నం జరి కొత్తపాలెంలో టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థి పెదకం శెట్టి గణబాబు తన ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలకు వివరించారు, ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూఈ ప్రాంతంలో నన్ను గెలిపించడం ద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రి ని చేస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అలాగే మన విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరతుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు, టిడిపి అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 89 వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, జిల్లా నాయకులు దొడ్డి చంద్రశేఖర్ టిడిపి సీనియర్ నాయకులు నందవరపు సోములు,పొలమరశెట్టి మహాలక్ష్మి నాయుడు,జిఎం నాయుడు, శిలపరిశెట్టి శ్రీనివాస్, గొర్లె నర్సింగరావు, పెచ్చేటి అప్పలరాజు, షేక్ బుచ్చారావు, కోళ్ల పీరు, రాజేష్, శిలపరిశెట్టి సురేష్, ఆళ్ల ఆదిబాబు, బత్తుల శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ కార్యదర్శి దాసరి శివశంకరరావు, మరియు తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.