సిపిఎం, బిజెపి కౌన్సిలర్లు అండతోనే కోట్ల అవినీతి.
అవినీతి పై చర్యలు చేపట్టాలి.
సిపిఐ ఖండన
సిపిఐ వనపర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్,
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ చైర్మన్ అవినీతికి సిపిఎం, బిజెపి కౌన్సిలర్లు అండగా నిలవడం వల్లే, చైర్మన్ వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్, మోష విమర్శించారు. శుక్రవారం వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరచింత మునిసిపాలిటీకి వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ. 18 కోట్లు మంజూరి కాగా,రూ. 9 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. దీనికి చైర్మన్ వైస్ చైర్మన్ కారణమని ఆరోపణలు ఉన్నాయన్నారు. వారిని గద్దధించేందుకు ఫిబ్రవరి 16న సిపిఐ, బీఆర్ఎస్, బిజెపి, సిపిఎం లకు చెందిన 6 మంది కౌన్సిలర్లు కలెక్టర్కు అవిశ్వాసం నోటీసు అందజేయగా, ఏప్రిల్ 4వ తేదీన అవిశ్వాసంపై ఓటింగ్కు సమావేశం పెట్టారన్నారు. అన్నారు. అవిశ్వాసం నోటీసు పై సంతకం చేసిన సిపిఎం, బిజెపికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సమావేశానికి రాలేదన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ వారిని రాకుండా కుట్ర చేశారన్నారు. ఈ వైఖరిని సిపిఐ ఖండిస్తోంది అన్నారు. అవినీతిపరులకుబుద్ధి చెప్పాలని కోరారు. నాయకులు కళావతమ్మ, మోష, గోపాలకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.