ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
బీబీ కేడి పార్టీ అభ్యర్థి శీను నాయక్
అక్షర విజేత జుక్కల్ ప్రతినిధి
తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడు గిరిజన ఆశాజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ జాదవ్ శీను నాయక్ ను జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీబీకేడి పార్టీ తరపన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి రాజు రాథోడ్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థి సీను నాయక్ మాట్లాడుతూతెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా మేలుకోండి మన తండాలు, గ్రామాలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన కష్టాలు, సమస్యల గురించి ధైర్యంగా పార్లమెంట్ లో మాట్లాడే ఏకైక వ్యక్తి, రాజకీయ అనుభవం కలిగిన బంజారా ముద్దుబిడ్డ జాదవ్ శీను నాయక్ గారికి ఒక్కసారి గెలిపిద్దాం. ఒకసారి సురేష్ షెట్కార్ కు అవకాశం ఇచ్చాము. 2 సార్లు బీబీ పాటిల్ గారికి అవకాశం ఇచ్చాము. ఈ ఒక్కసారి జాదవ్ శీను నాయక్ ను అవకాశం ఇచ్చి చూద్దాం. మన వెనకబడిన జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్న గ్రామాలు, తండాలు అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వస్తున్న జాదవ్ శీను నాయక్ ను గెలిపిద్దాం. ఎవరెవరో నాయకులు ఎక్కడెక్కడ నుంచో ఎన్నికల సమయంలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ జాదవ్ శీను నాయక్ లోకల్… వాళ్ళు గెలిచాక 5 సంవత్సరాలలో 5 సార్లు కూడా మన గ్రామానికి రారు కానీ శీను నాయక్ 24 గంటలు మన మీతోనే, మీలోనే ఉంటారు. ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.