* తుక్కుగూడ కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి
* కాంగ్రెస్ పార్టీ నవాబ్ పెట్ మండల ఉపాధ్యక్షుడు మీనేపల్లి శివప్రసాద్
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
తుక్కుగూడ లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నవాబుపేట్ మండల ఉపాధ్యక్షుడు మీనేపల్లి శివప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం నవాబ్‌పేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివప్రసాద్ అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధితో మాట్లాడుతూ, తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ నవాబుపేట్ మండలం నుండి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు. తుక్కుగూడ లో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు మల్లిఖార్జున ఖర్గే, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారని పేర్కొన్నారు. భారీ బహిరంగ సభ మన రాష్ట్రంలోని తుక్కుగూడలో జరగడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతి ఒక్కరు తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.