రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రధాని మోడీకి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బీసీల అంశాలను నెరవేర్చినటువంటి దాఖలాలు లేకపోవడం బాధాకరం అని నాయకులు అన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీసీల అంశాలను తన మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ ఆక్ట్ ఏర్పాటు చేయాలి. బీసీల్లో రోస్టర్ విధానం అమలు చేసి ఎస్సీ ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింప చేయాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ ఉద్యోగులకు పదోన్నతులో రిజర్వేషన్ల అమలు చేయాలి. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలి ఇవన్ని డిమాండ్ లను బీజేపీ, కాంగ్రెస్ లలో ఏ పార్టీ అయితే ఈ అంశాలను మేనిఫెస్టోలో చేరుస్తుందో ఆ పార్టీకే బీసీ సమాజం అండగా ఉంటదని, ఏ పార్టీ అయితే బీసీ వ్యతిరేక విధానాలు పాల్పడుతుందో ఆ పార్టీని బీసీ సమాజం ముందు దోషుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లీ వెంకన్న, పట్టణ అధ్యక్షులు బోడంకి మహేష్, జిల్లా నాయకులు రాసమల్ల కుమార్, కీర్తి బిక్షపతి, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, ఆడెపు రాజు తదితరులు పాల్గొన్నారు.