బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు.
-బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి – డి ఐ ఈ ఓ రవికుమార్
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా డిఐఈఓ కార్యాలయం నందు పూలమాల వేసి ఆయన బడుగు బలహీనవర్గాల కొరకు చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవికుమార్ ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షులు చిరంజీవులు, రజియుద్దీన్, నారాయణ, తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ అద్యక్షులు మామిడి విట్టల్ తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అద్యక్షులు బండారి భాస్కర్, తెలంగాణ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పైసా వినోద్ కుమార్, జే యల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సయ్య ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ వి. పరశురాం తదితరులు పాల్గొన్నారు.