Saturday, April 19, 2025
spot_img

హామీలను మర్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

హామీలను మర్చిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్ వి ఎలక్షన్ కోడ్ రాజకీయాలు

బిజెపి వి ఈడీ రాజకీయాలు

రాముడు పేరుతో బిజెపి రాజకీయం చేస్తుంది

బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

మాజీ మంత్రి టి హరీష్ రావు

 

అక్షరవిజేత, పాపన్నపేట

వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చాక హామీలను మర్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు పిలుపునిచ్చారు. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి అనంత పద్మనాభ స్వామి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వి ఎన్నికల కోడ్ రాజకీయాలని, బిజెపి వి ఈడీ రాజకీయాలని, రాముడు పేరుతో బిజెపి రాజకీయం చేస్తుందని,బిజేపీ కి నచ్చితే జోడీ, కాదంటే ఈడీ అని హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బిజెపి రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటేనే విజయం సాధ్యం అని,విభేదాలు పక్కన పెట్టి,కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు పెట్టాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రజల కోసం కష్టపడే బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మెదక్‌ను జిల్లా కేంద్రం చేసి, మెదక్‌కు రైలును, మెడికల్ కాలేజీని తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు.
ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ మంజూరు చేసిన వంద కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వాపసు తీసుకుందని,అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని,నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేటు ముంచిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో చమరగీతం పాడాలన్నారు.డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదని,బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతూ,రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుబంధు కింద పెంచుతామని చెప్పిన రూ. 15 వేలు కు అమలుకు నోచుకోలేదన్నారు.
కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా మోసం చేశారన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు సమస్యలే లేవని, కరెంటు, నీళ్లు పుష్కలంగా ఉండి, మెదక్ సస్యశ్యామలంగా మారిందన్నారు.కానీ ఇప్పుడు కరెంటు పోతోందనడానికి,ఈ సభలో కరెంట్ పోవడం దీనికి నిదర్శనం అన్నారు.రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ 42 లక్షల మంది అవ్వాతాతలను మోసం చేశారని ఆరోపించారు.అన్నవస్త్రం కోసం ఆశపడితే ఉన్నవస్త్రం పోయిందట.. మాట తప్పిన కాంగ్రెస్‌కు అవ్వాతాతలు గట్టిగా బుద్ధి చెప్పాలని హరీష్ రావు కోరారు.హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, మెడలు వంచాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆడవాళ్లకు నెలకు రూ. 2500 ఇస్తామని,కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని,
నిరుద్యోగులకు రూ.4 వేలు ఇస్తామని హామీలిచ్చారని,కానీ అసలు ఆ హామీలనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం నిండు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారని ఆరోపించారు.ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీని కూడా ఇవ్వలేదన్నారు.ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ఓటు వేస్తే గొర్రె కసాయివాడిని నమ్మినట్టే నన్నారు.బీజేపీ కూడా ఓట్ల కోసం వస్తోందన్నారు. రఘునందన్ రైతులకు ఎడ్లు, నిరుద్యోగులకు భృతి ఇస్తామని దుబ్బాక ప్రజలను మోసం చేసి గెలిచారని,
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు ఎంపీగా గెలిపించాలని వస్తున్నారని,
హామీలు నిలబెట్టుకోని రఘునందన్‌కు ఓట్లే వేయవద్దన్నారు.పదేళ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయన్నారు.
బీఆర్ఎస్ వెంకట్రామిరెడ్డి ఉన్నత విద్యావంతుడు, పదకొండేళ్లు కలెక్టర్‌గా పనిచేశారని, ప్రజల సమస్యలపై అవగాహన ఉందన్నారు. వెంకట్రాంరెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవ చేసేందుకే తాను పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచానని,తనను ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో తాను పనిచేశానని, ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు.రూ. 100 కోట్లతో పివిఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానని, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలను చేపడతానన్నారు. ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించేందుకు ప్రతి ఓటరు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ శశిధర్ రెడ్డి, ఎం దేవేందర్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్,నగేష్ ముదిరాజ్, తాడపు సొములు, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్మరి జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, వెంకట్ రాములు, శ్రీనాథ్ రావు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles