మాదిగ హక్కుల దండోరా అధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలను మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ ఎరియాలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాట్లాడుతు
బాబు జగ్జీవన్ రామ్ బిహార్ రాష్ట్రంలోని శాబాద్ జిల్లా లోని చాంద్వా గ్రామంలో అత్యంత అణగారిన వర్గాములో ఒకటైన చమర్ కులంలో శోభా రామ్- వసంత దీవి దంపతులకు జన్మించాడని, వెలియేయబడ్డ అణగారిన కులంలో పుట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన మేదో సంపత్తితో అంచలంచెలుగా ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారని పేర్కొన్నారు. సాధారణమైన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారడానికి కేవలం విద్య ప్రదానం అని నమ్మి ఆచరించిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. భారత స్వతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ సంఘసంస్కర్తగా, రాజకీయ నాయకుడిగా, భారతదేశ తొలి ఉప ప్రధానిగా కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక పదవులు పొంది దాదాపు 50 సంవత్సరాలుపార్లమెంట్ సభ్యునిగా కొనసాగిన ఏకైక నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తు భారత దేశ ప్రజలందరూ కూడ కులమతాలకు అతీతంగా సమసమాజం కోసం పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు కాంపల్లి రాజం, దాసరి బాణయ్య, అరేపల్లి రమేష్, ఎనగందుల శివాజి, కల్లేపల్లి నవీన్, సంగే సారయ్య, అంబాల రాజారాం, తదితరులు పాల్గొన్నారు.