ఉపాధి కూలీలకు ఓవర్ ఎస్ అందజేత
ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ మాధురి
సిహెచ్ఓ చంద్ర ప్రకాష్
అక్షర విజేత కుల్కచర్ల
కుల్కచర్ల ఉమ్మడి మండలంలోని ఆశకార్యకర్తలు వివిధ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్నటువంటి కూలీల దగ్గరకు వెళ్లి ఎండలు విపరీతంగా ఉన్న దృష్ట్యా కూలీలను ఉద్దేశించి వడదెబ్బ గురించి తెలియజేస్తూ వాటి లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడమే కాకుండా అందరికీ కూడా ఓవర్ ఎస్ పాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ మాధురి సిహెచ్ఓ చంద్ర ప్రకాష్ ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఓవర్ ఎస్ పాకెట్స్ పంచి వడదెబ్బ గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 20 గ్రామాల ఆశకార్యకర్తలు స్వరూప పద్మ డప్పుయాదమ్మ సత్యమ్మ అంబుబాయ్ బాలమణి సునీత స్వరూప లావణ్య జయమ్మ పుష్ప మంజుల లావణ్య రాధ రాధిక పుష్పాలత అంజమ్మ నిర్మల పద్మ సుక్కమ్మ మరియు పి హెచ్ సి సిబ్బంది స్వరూప రాణి యాదమ్మ విజయలక్ష్మి సిరాజ్ ప్రశాంత్ వివిధ గ్రామాల ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు