నూతన వధూవరులను ఆశీర్వదించిన ఉప ముఖ్యమంత్రి బట్టి
అక్షర విజేత ఎర్రుపాలెం
ఎర్రుపాలెం మండల పరిధిలోని మొలుగుమాడు గ్రామ కాంగ్రెస్ నాయకులు రేళ్ళచర్ల నరసింహారావు వెంకటేశ్వరమ్మ దంపతుల కుమారుడు గోపి,లక్ష్మీ మహేశ్వరి వివాహానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నూతన వధూవరులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిండు మనస్సుతో అక్షింతలువేసి ఆశీర్వదించారు. తొలిత మండల పర్యటనకు విచ్చేసిన ఉపముఖ్యమంత్రి కి ఆయన వెంట విచ్చేసిన వివిధ నియోజకవర్గాలఎమ్మెల్యేలకు శుక్రవారంకాంగ్రెస్ నాయకులు ఘనస్వాతం పలికారు. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గ ప్రసాద్, గిడ్డంగుల సంస్థ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ రెడ్డి, బండారు నరసింహారావు,క్లస్టర్ ఇంచార్జ్ కడియం శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమోలు కృష్ణారావు,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంటాతిరుపతమ్మ ,కంచర్లవెంకటనరసయ్య,గుడేటిబాబురావు, దేవరకొండరాజీవ్ గాంధీ,యన్నంపిచ్చిరెడ్డి, మీడియా ఇంచార్జ్ మల్లెల లక్ష్మణరావు ,షేక్ఇస్మాయిల్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు