దివ్యాంగునకు మూడు చక్రాల సైకిలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ వైరా
అక్షర విజేత వైరా
దివ్యాంగులకు వారి అవసరాలకు అనుగుణంగా వారికి కావలసిన సామాగ్రిని అందించడంలో లయన్స్ క్లబ్ వైరా ఎల్లవేళలాఅందుబాటులో ఉంటుందని పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీ కృష్ణ అన్నారు స్థానిక కొమిరిశెట్టి శ్రీధర్ ఇంటి వద్ద క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్ర రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొమిరిశెట్టి శ్రీధర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన దాతృత్వంతో వైరాకు చెందిన దివ్యాంగుడు ఎలగందుల కోటేశ్వరరావుకు మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేస్తూ ఆయన మాట్లాడినారు క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు మాట్లాడుతూ క్లబ్ లో కొమిరిశెట్టి శ్రీధర్ సభ్యత్వం తీసుకున్న మొదటి సంవత్సరమే క్లబ్లో ఉత్సాహంతో వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు వారి కుటుంబ సభ్యుల శుభకార్యాల రోజులలో చేయడంతో పాటుగా వివిధ సందర్భాల్లో వివిధ రకాల ఆర్థిక సహాయాన్ని క్లబ్ కు అందజేయడం జరిగిందని ఆయన తెలియజేసినారు ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ వనమా విశ్వేశ్వరరావు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు కొమిరిశెట్టి శ్రీధర్ పుష్పావతి సహాయ కార్యదర్శి కొల్లా రాంబాబు మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు కోదండ రామాలయం చైర్మన్ మిట్టపల్లి సత్యంబాబు నంబూరు రామారావు తాడికొండ రాము, మరికంటి రాంగోపాల్ కట్ల సురేష్ వజినేపల్లి చక్రవర్తి నూకల శ్రీనివాసరావు
వై.బుచ్చిరామారావు నాళ్ళ గంగాధర్ కొమిరిశెట్టి కృష్ణ లీలావతి తదితరులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు.