* ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలు

అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జి ల్లా బిజెఆర్ చౌరస్తా నందు వున్న బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి ఘనంగా జరుపుకున్నాం. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లేశం,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి,పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ మల్లేశం, బి.సి కార్పొరేషన్ ఉపేందర్, బాబు మోజెస్, శిశు సంక్షేమ అధికారి పద్మ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.