బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
అక్షర విజేత, మోర్తాడ్
బాల్కొండ నియోజకవర్గం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో శుక్రవారం మోర్తాడ్ లోని ప్రజా నిలయం భవనంలో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు సామ రాజెందర్, ముప్కాల్ మాజీ ఎంపిటిసి గైని సాయన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి నిజామాబాద్ పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలుచుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని జీవన్ రెడ్డి కల్పించాలని సునీల్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యంరెడ్డి, చిన్నారెడ్డి, ముప్కాల్ మాజీ సర్పంచి కొమ్ముల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.