ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
అక్షర విజేత, మాక్లూర్
మండల కేంద్రంలోని మాక్లూర్ లో ఉన్న సహకార సంఘం ఆధ్వర్యంలో మాక్లూర్ తో పాటు గొట్టుముక్కల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను స్థానిక సొసైటీ చైర్మన్ అశోక్ మాక్లూరులో, డైరెక్టర్ దయాకర్ రావు గొట్టుముక్కలలో ప్రారంభించారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని ఆయన సూచించారు. దళారుల చేతుల్లో మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాశీ నాథ్ రావు , ఎంపిటిసి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.