* గ్రూప్స్ కొరకు ఉచిత కోచింగ్ సెంటర్
* జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎన్ మల్లేశం
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
గ్రూప్స్ I,II, III ఉద్యోగాల కొరకు ఉచిత స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ : జిల్లా ఎస్.సి. నిరుద్యోగ యువతీ, యువకులకు గ్రూప్స్ కొరకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందని వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి యన్ మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబడుతున్న వివిధ ఉద్యోగాల నియామక ప్రక్రియలో లో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖా వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో డిగ్రీ, పిజీ. కోర్సులు పూర్తి చేసిన 100 మంది ఎస్.సి. నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్స్ కొరకు ఉచిత కోచింగ్ మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వబదుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి యన్. మల్లేశం శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. కోచింగ్ ను నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించబడుతుందని తెలిపారు. కోచింగ్ సమయంలో వారికి హాస్టల్ వసతి, భోజన సదుపాయం తో పాటు అవసరమైన స్టడీ మెటీరియల్ అందచేయబడును. ఏదేని పూర్తి వివరాలకు 7013200133 ఫోన్ నెంబర్ ని సంప్రదించగలరని తెలిపారు.