బీఆర్ఎస్ హయంలోనే మైనార్టీల అభివృద్ధి
— మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభత్వ హయంలో మైనార్టీలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, బీఆర్ఎస్ హయంలోనే మైనార్టీల అభివృద్ది జరిగిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు. శుక్రవారం జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం బిచ్కుంద బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మానోర్కాపు సంగమం వద్ద ఉపవాసదీక్షకులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సభ్యుడు హన్మంత్ షిండే మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ పదవీకాలం, తెలంగాణ రాష్ట్రంలో గంగా జమ్నీ నాగరికతకు దావత్ ఇఫ్తార్ పార్టీ ఒక ఉదాహరణ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రంజాన్ మాసంలో ముస్లిం మైనార్టీలకు ఈద్ కానుకగా దావత్, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీ వర్గాలను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని, ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ప్రజలు భారీ మెజారిటీతో ఓటు వేయాలని, పార్లమెంట్‌లో నే ప్రజల గొంతుకగా నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు అసద్ అలీ, బీఆర్‌ఎస్ పార్టీ డైనమిక్ మైనార్టీ నాయకుడు కలీం పటేల్, సయ్యద్ నవాజ్, అన్వర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, అశోక్ పటేల్, ఎన్ బాలు, రాజు, సుల్తాన్, మాజీ కో-ఆప్టేషన్ సభ్యుడు కరీం, తదితరులు హాజరయ్యారు.