హనుమ నాయక్ ఆశయాలను కొనసాగిస్తాం
అక్షరవిజేత మహబూబాబాద్
సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ హనుమా నాయక్ మరణం సేవాలాల్ సేన సంఘానికి తీరనిలోటని,వారి ఆత్మకు శాంతి కలగాలని సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవనాయక్,రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.శుక్రవారం వారి స్వగృహం మానుకోటలో సేవాలాల్ సేన మానుకోట జిల్లా కమిటీ సభ్యులందరూ ఘనంగా నివాళులర్పించి సేవాలాల్ సేన జెండాను పార్థివ దేహం పై కప్పి జోహార్లు సమర్పించారు.జాతి కోసం అహర్నిశలు కష్టపడేవారని సేవాలాల్ సేనలో గత ఎనిమిది సంవత్సరాలుగా జాతి ఉనికి కోసం జాతీయ అభివృద్ధి కోసం తన సేవలు మరువలేని అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ నందులాల్ నాయక్,జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్,జిల్లా అధికార ప్రతినిదులు మాలోత్ సురేష్ నాయక్,జరుపుల బాలు నాయక్,లింగన్న నాయక్,సేవాలాల్ మహిళా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లకావత్ పద్మ బాయి,మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు భూక్యా స్రవంతి మోహన్ నాయక్,దేవిబాయి,ఉద్యోగ సేన నాయకులు భీముడు నాయక్,బన్సీలాల్ నాయక్ బాలాజీ నాయక్ జిల్లా కోఆర్డినేటర్,ఘనంగా నివాళులర్పించి జోహార్లు సమర్పించారు.