ఆపదలో ఉన్న చిన్నారికి ఆర్థిక సహాయం అందజేత

యాభై వేలు అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు..

విజేత,వెంకటాపురం : వేంకటాపురం మండలం లోని బెస్తగూడెం గ్రామానికి చెందిన గుండారపు రాజేష్, మమత దంపతుల 7 ఏళ్ల కుమార్తె జాహ్నవి ‘బ్రౌన్ క్యాన్సర్’ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. చిన్నారికి మెరుగైన వైద్యం అందించే క్రమంలో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత వెంటనే స్పందించడం జరిగింది.మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు, చిన్నారి వైద్య చికిత్స కోసం తమ వంతు సహాయంగా రూ. 50,000/- (యాభై వేల రూపాయలు) నగదును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం తమ బాధ్యతని, చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాడూరి రఘు, బట్టు గోపి, మంచర్ల నాగేశ్వరావు, బట్టు నాగేందర్, రెబ్బల సత్యం, బట్టు కొమరయ్య, ఎర్రల్ల సారయ్య మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :