హక్కులు రూపొందించిన రైటర్ అంబేద్కర్….

* జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్….
కొల్చారం, అక్షర విజేత :-
కొల్చారం మండలం సంగాయిపేట్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలను రూపకల్పన చేసి హక్కులు అందించడంలో కృషి చేశారు అన్నారు.
కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం చట్టసభల్లో పోరాడిన విధానం ఆయన ద్వారా పొందిన మేలు మర్చిపోలేనిది
అతి చిన్న వయసులోని ఎమ్మెల్యేగా మంత్రిగా 50 ఏండ్ల గొప్ప పార్లమెంటరీగా 30 ఏళ్లు కేంద్రమంత్రిగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తూ ఓటమెరుగని మహానేతగా ప్రపంచ రికార్డు పొందిన వ్యక్తి హరిత విప్లవ సృష్టికర్త యుద్ధ రంగ వ్యూహకర్త జగ్జీవన్ రామ్ అని కొనియాడారు
ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంగన్నగారి అగంగౌడ్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి పెద్దలిగన్నగారి నాగయ్య, పుర్ర మల్లయ్య, 7వ, వార్డు మెంబర్ పి ఎల్ రాజు, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్, పి ఎల్ కిష్టయ్య, టి ప్రవీణ్, పి రాజు, కొజ్జాపురం పోచయ్య, రామకృష్ణ, గిరి, గడ్డం కుమార్, పుర్ర జాన్, చిన్ని గారి ప్రతాప్, సుధాకర్, నాని, చిన్నిగారి, నితిన్, అఖిల్, దేవదాసు, తదితరులు పాల్గొన్నారు.