Sunday, April 20, 2025
spot_img

నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

-పూలమాలలు వేసి నివాళులర్పించిన - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్
-పూలమాలలు వేసి నివాళులర్పించిన – నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్

అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:

నిజామాబాద్ లోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జగ్జీవన్ రాం గారు (ఏప్రిల్ 5, 1908 – జులై 6, 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త
బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధి చెందాడని చెప్పారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.
జగ్జీవన్ రామ్ బీహార్‌లోని అర్రా సమీపంలోని చంద్వాలో భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో జన్మించాడు.1946లో జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యాడు. తదుపరి భారత మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా, భారతదేశంలో అనేక కార్మిక సంక్షేమ విధానాలకు పునాది వేశాడు.అతను 1947 ఆగస్టు 16 న జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్మిక సదస్సుకు హాజరైన ప్రతిష్టాత్మక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో ఒకడు. రామ్ ప్రధాన రాజకీయ గురువు, గొప్ప గాంధేయవాది, బీహార్ బిభూతి అనుగ్రహ నారాయణ్ సిన్హాతో పాటు, అప్పటి ప్రతినిధి బృందానికి అధిపతిగా, కొన్ని రోజుల తరువాత అతను అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అని తెలియజేశారు. అతను 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు. జగ్జీవన్ రామ్ 1952 వరకు కార్మిక మంత్రిగా పనిచేశాడు.భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్ ఒక సభ్యుడు. రామ్ 1946లో తాత్కాలిక జాతీయ ప్రభుత్వంలో పనిచేశాడని అన్నారు. తరువాత అతను నెహ్రూ క్యాబినెట్ లో కమ్యూనికేషన్స్ (1952-56), రవాణా, రైల్వేలు (1956-62), రవాణా, కమ్యూనికేషన్స్ శాఖలకు (1962-63) లో ఇంకా అనేక శాఖలకు మంత్రి పదవులను నిర్వహించాడు. ప్రజలు, యువకులందరూ బాబు జగ్జీవన్ రామ్ గారి అడుగుజాడల్లో నడవాలని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాజిరెడ్డి జగన్మోహన్, ప్రభాకర్ రెడ్డి , సుజిత్ సింగ్ ఠాకూర్ , రాజు సత్య ప్రకాష్ మురళి, నవీద్ ఇక్బాల్ తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles