రాంసాగర్ బాబూ జగ్జివన్ రామ్ జయంతి
అక్షర విజేత, కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ తాడురి రవీందర్ శుక్రవారం రోజున బాబూ జగ్జివన్ రామ్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివళులర్పించారు అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించారు స్వాతంత్ర్య సమరయోధులు భారత ఉప ప్రధానిగా పనిచేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడురి దుర్గయ్య, భారత్ కుమార్, ప్రకాష్, కిరణ్, పవన్, కిష్టయ్య, తాడురి పండు, తిప్పారం భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.