జలం ఉన్న.. జనాలకు లేవు..
అక్షర విజేత తల్లాడ:
తల్లాడ మండల కేంద్రంలోని శివాలయం దగ్గర ఉన్న ఎదల చెరువులో ఉన్న బావి జలంతో నిండుగా ఉన్న జనాల అవసరాల మాత్రం తీర్చలేకపోతుంది. ప్రస్తుత భానుడి భగభగ తో అల్లాడిపోతున్న జనాలు నీళ్ల కరువుతో మరింత ఇబ్బందులు పాలవుతున్నారు. కనీస అవసరాలకు కూడా సరిపోయే అంత నీరు సరఫరా కానీ స్థితిలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లాడ మండల కేంద్రంలో ఎదుళ్ళ చెరువులో ఉన్న బావి అనేక దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్నది. అనేక దశాబ్దాల నుంచి తరతరాల ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఎంతగానో ఉపయోగపడింది. ఎంతటి ఎండాకాల తరుణంలో కూడా నీటికి ఇబ్బంది లేకుండా ప్రజల అవసరాలు తీర్చేది.ఒకప్పుడు ఇదే నీళ్లను ప్రజలు తాగేవారు కాలక్రమేన అవి అవసరాల నిమిత్తం వాడుకునేవారు కానీ ప్రస్తుత తరుణంలో ప్రజలకు ఉపయోగపడనీ పరిస్థితి నెలకొంది. గత కొద్ది సంవత్సరాల క్రితం పంచాయతీ సిబ్బంది మోటార్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు నీరు అందించారు కానీ మోటర్ల సమస్య వల్ల గత కొద్ది సంవత్సరాలుగా దానిని అలాగే వదిలేశారు. ప్రస్తుతం ఎండాకాల తరుణంలో ప్రజలు నీటి సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బావికి మోటర్ ఏర్పాటు చేసి నీటిని ప్రజలకు అందించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.