జన జాతర సభను విజయవంతం చేయండి
చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్
అక్షర విజేత చిన్నంబావి
తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు.శుక్రవారము చిన్నంబావి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం ఐదు గ్యారంటీ లను ఈ సభలో ప్రకటించనున్నారని తెలిపారు.పార్టీ జాతీయ అధ్య క్షుడు మల్లికార్జున్ ఖర్గే,అగ్రనేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హాజరవు తారన్నారు.ఈ సభకు తాజా మాజీ సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు,కార్యకర్తలు అధిక సంఖ హాజరై విజయవంతం చేయాలని కోరారు.