కొత్తపల్లి లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశం
మండల సర్పంచ్ ల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు కుమ్మరి జగన్
అక్షరవిజేత,పాపన్నపేట
మెదక్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశం పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి ఆనంతపద్మనాభస్వామి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహిస్తున్నట్లు పాపన్నపేట మండల సర్పంచ్ ల మాజీ ఫోరమ్ అధ్యక్షుడు కుమ్మరి జగన్,మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జి విష్ణువర్ధన్ రెడ్డి లు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి వెంకటరామిరెడ్డి, మాజీ శాసనసభ్యులు పట్లోళ్ళ శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పాపన్నపేట మండలం బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జగన్,విష్ణువర్ధన్ రెడ్డి లు విజ్ఞప్తి చేశారు.