సైబర్ నేరాలపై విద్యార్థులకు శిక్షణ
అక్షర విజేత సిద్దిపేట
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ దుర్గా మాట్లాడుతూ చాలామంది వారి వారి ఇండ్లలో ఉండి విధులు నిర్వహించడం ఫోన్లు మరియు లాప్టాప్ లు ఎక్కువ ఎక్కువగా వాడడం వల్ల సైబర్ నేరాల నుండి ప్రజలను రక్షించడానికి 2021 జూన్ మాసంలో సైబర్ కాంగ్రెస్ ఉమెన్ సేఫ్టీ తెలంగాణ పోలీస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 50 ప్రభుత్వ స్కూళ్లను 100 మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేయడానికి విద్యార్థులను ఎంపిక చేసి ఒక ఉపాధ్యాయుని మానిటర్ చేయడానికి నియమించి ఆన్లైన్ ద్వారా ఐదు సెషన్ లో సైబర్ నేరాల గురించి పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. వారు తోటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం గురువారం ప్రతి గ్రామ గ్రామాన మారుమూల పల్లెటూర్లలో కూడా సైబర్ నేరాలు గురించి తెలుసుకునే అవకాశం కుదిరిందని తెలిపారు.
టెక్నాలజీ ద్వారా ఈరోజు దేశం రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని టెక్నాలజీ ఎలా ఉపయోగించాలో అది మన చేతుల్లో ఉంటుందని సూచించారు టెక్నాలజీ ద్వారా లాభం నష్టం రెండూ ఉంటాయని మంచి చెడు మనిషి విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు మన మనసును మనం కంట్రోల్ చేసుకుంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు మానవ మనుగడకు టెక్నాలజీ ఎంతో ముఖ్యమని టెక్నాలజీతో ఎన్నో నేర్చుకోవచ్చని తెలిపారు ఎక్కడో అమెరికాలో ఉన్న వారితో క్షణాల్లో మాట్లాడవచ్చని వారి బాగోగులు మరియు మన బాగోగుల గురించి చర్చించుకోవచ్చు అని సూచించారు
సైబర్ అంబాసిడర్లు మరింత ఆశయాలతో ముందుకు వెళ్లి ప్రజలకు మిత్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు భవిష్యత్తులో టెక్నాలజీ మరింత పెరుగుతుందని టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని తెలిపారు ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో నేరాల గురించి షీ టీమ్స్ యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు సైబర్ నేరాల గురించి ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు గ్రాండ్ ఫినాలో తో ఆపకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉమెన్ సేఫ్టీ తెలంగాణ పోలీస్ వారి సహకారంతో మరింత మంది సైబర్ అంబాసిడర్లను తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.సైబర్ అంబాసిడర్లుగా ఉత్తమ సేవలు అందించిన ముగ్గురు విద్యార్థులకు మెమొంటోలు మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు సైబర్ అంబాసిడర్లు, విద్యార్థిని విద్యార్థులు, సిద్దిపేట షీటీమ్ బృందం మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.