మరికల్ గ్రామ పంచాయతీ మహిళ సిబ్బందికి చీరల పంపిణీ చేసిన…ఎన్ఎస్ యూఐ జిల్లా కమిటీ సభ్యులు మహమ్మద్ అన్వర్
అక్షర విజేత,: మరికల్/ ధన్వాడ:
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి గురువారం రంజాన్ పండుగను పురస్కరించుకొని నారాయణపేట జిల్లా ఎన్ఎస్ యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) కమిటీ సభ్యులు మరికల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అన్వర్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అన్వర్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందికి ఉచితంగా చీరలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.