ప్రజలారా మేల్కొండి
సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోండి
అక్షరవిజేత, దేవరకొండ
ప్రజలు కోరితే. ఏ ప్రభుత్వాదికరైన సమాచారం ఇవ్వాల్సిందే.
తేది 12 అక్టోబర్ 2005 నుండి అమలులోనికి వచ్చిన సమాచార హక్కు చట్టం ఆర్టిఐ 2005.
సెక్షన్ 6(1)ప్రకారం సమాచారం కోరే హక్కు
సెక్షన్ 6(2)ప్రకారం సమాచారం అడిగే హక్కు మనది.
అది ‘మీకు ఎందుకు’అని అడిగే హక్కు అధికారులకు లేదు
సెక్షన్ 4(1)ప్రకారం నెలవారీ జీతభాత్యాలను సైతం అధికారులు ప్రజలకు తెలపల్సిందే.
సెక్షన్ 22(1)ప్రకారం దరఖాస్తును స్వికరించేందుకు తిరస్కరించిన..తప్పుడు, అసంపూర్తి, తప్పుడ్రోవ పట్టించే సమాచారం ఇచ్చినా అధికారులకు 25,000/-జరిమానా విధించబడును.
సెక్షన్ 6(3)ప్రకారం వారిది కానీ సమాచారాన్ని మరో కార్యాలయానికి పంపవలసిన భాద్యత అధికారులదే.
సెక్షన్ 2(జె ) ఐ ప్రకారం ప్రజలందరూ ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయవచ్చు.
సెక్షన్ 7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వాల్సిందే. వ్యక్తి జీవితానికి, స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల లోపే ఇవ్వాలి.
సెక్షన్ 7(6)ప్రకారం 30 రోజులు దాటాక వచ్చే సమాచారం ఉచితం.
సెక్షన్ 19(8)(బి )ప్రకారం దరఖాస్తుదరునికి నష్టపరిహారం వస్తుంది.
సెక్షన్ 8(3)ప్రకారం గడిచిన ఎన్ని సంవత్సరాల సమాచారం అయినా.. కొరవచ్చు.
సెక్షన్ 4(4)ప్రకారం మాతృభాష తెలుగులో సమాచారం ఇవ్వాల్సిందే.
సెక్షన్ 18(3)ప్రకారం అధికారులే కమీషన్ ఎదుట స్వయంగా(తప్పనిసరిగా)హాజరుకావలి.
సెక్షన్ 2(జె )(ఐ ఐ)ప్రకారం ప్రతి పేజీనీ అధికారులు ధ్రువీకరించి ఇవ్వాలి నా దేశం.నా హక్కు రైతు సంక్షేమ సేవ సంఘం విభాగం ఆర్టిఐరాష్ట్ర అధ్యక్షులు ఎఫ్ డబ్ల్యు ఓ ఆర్ టి ఐ కొర్ర. కిషన్ నాయక్.