Sunday, April 20, 2025
spot_img

మంచిర్యాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గా వేముల కృష్ణ

మంచిర్యాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గా వేముల కృష్ణ

అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:

తనపై నమ్మకంతో మంచిర్యాల అసెంబ్లీ కో-ఆర్డినేటర్ గా నియామకానికి కృషి చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని మంచిర్యాల నియోజకవర్గ కో- ఆర్డినేటర్ వేముల కృష్ణ అన్నారు. కాంగ్రెస్ కాసిపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణ నూతనంగా మంచిర్యాల నియోజకవర్గం కో-ఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. దేశంలో మత రాజకీయాలకు చరమగీతం పాడాలని, ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని ఈ సందర్భంగా కోరారు. తనపై నమ్మకంతో కోఆర్డినేటర్ గా నియమించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles