దళారులను నమ్మి మోసపోవద్దు…!!
* మరిపెడ ఏటీఎం రాములు
అక్షర విజేత మరిపెడ:-
దళారులను నమ్మి మోసపోకుండా ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలని మరిపెడ ఏపిఎం రాములు రైతులకు సూచించారు. మరిపెడ మండలం వీరారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో సహజ గ్రామ మహిళా సంఘం ఏర్పాటు చేసుకున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు వరి ధాన్యం కొనుగోలు తూకంలో పాత పద్ధతులను అవలంబిస్తూ మోసం చేస్తున్నారని అన్నారు. అలాంటి దళారువేపాలను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలలో దాన్యం అమ్ముకోవాలని రైతులను కోరారు. ఇందుకు మద్దతు ధరగా ఏ గ్రేడ్ రకానికి రూ.2203, సాధారణ రకానికి రూ .2183 చొప్పున రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులంతా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ రుక్మిణి, సీఏ గాజుల రాణి, మహిళా సంఘం అధ్యక్షురాలు సోమలక్ష్మి, కార్యదర్శి ఎల్లమ్మ, నాగమణి పాల్గొన్నారు.