మర్రిపల్లి లో ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట *
— బోనాల బ్రహ్మోత్సవాలు
అక్షరవిజేత,చారకొండ:
మర్రిపల్లి గ్రామం లో వడ్డెర కులస్థుల ఆరాధ్య దైవమైన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.గురువారం విగ్రహ ప్రతిష్ట అనంతరం మహిళలు బోనాలతో అమ్మవారికి బాండ్ మేలాలతో,డప్పు చప్పులతో కన్ను విందుగా ఆలయం వద్దకు చేరుకుని ఆలయం చుట్టూ తిరిగి అమ్మ వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమానికి యువ నాయకులు,మర్రిపల్లి మాజీ సర్పంచ్ అంగోత్ నరేష్ నాయక్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్,ఈదమ్మ తల్లిని దర్శింకుని ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాండు,శ్రీనయ్య,కొండల్,యాదయ్య,విష్ణు,వెంకటయ్య,సత్తయ్య,రాములు,రమేష్,సైదులు, పున్నయ్య,స్వామి,వడ్డెర కులస్థులు, గ్రామపెద్దలు,మహిళలు,యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.