* బావి పూడికతీత ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి
* సామల వీరారెడ్డికి ముగ్గురు కుమారులు మల్లారెడ్డి, మాణిక్ రెడ్డి, మాధవరెడ్డి


* 4 చింత చెట్లు, 3 మామిడి చెట్లు, 2 బావులు ఉమ్మడి ఆస్థిగా ముగ్గురు కుమారులు అనుభవించాలి
* వికారాబాద్ మండలంలోని కామారెడ్డి గూడ గ్రామంలో బావి పూడికతీత గురించి గొడవ
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామంలో సామల వీరారెడ్డికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సామల మల్లారెడ్డి, రెండవ కుమారుడు సామల మాణిక్ రెడ్డి, మూడవ కుమారుడు సామల మాధవ రెడ్డి. సామల వీరారెడ్డికి ఉన్న భూమి ఆస్థిలో పెద్ద కుమారుడు సామల మల్లారెడ్డికి 5.31 ఎకరాలు. రెండవ కుమారుడు సామల మాణిక్ రెడ్డికి 5.05 ఎకరాలు. మూడవ కుమారుడు సామల మాధవరెడ్డికి 5.05ఎకరాల చొప్పున గ్రామ పెద్దల సమక్షంలో పంపిణీ చేసుకున్నారు. పంపిణీ చేసుకున్న భూమి వివరాలను ముగ్గురు కుమారుల సమక్షంలో న్యాయవాదిచే బాండ్ పేపర్లపై లిఖితపూర్వకంగా రాసుకున్నారు. ఉమ్మడి స్థిర ఆస్థిగా 4 చింతచెట్లు, 3 మామిడి చెట్లు, 2 బావులు ముగ్గురు కుమారులు అనుభవించేటట్లుగా అందరి సమ్మతితో లిఖితపూర్వకంగా రాసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సామరస్యంగా ఎవరి వాటా భూమిలో వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించే వారమని సామల మల్లారెడ్డి కుమారుడు సామల కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. సామల మాణిక్ రెడ్డి తన భూమిని కామారెడ్డి గూడ గ్రామానికే చెందిన సామల పర్మారెడ్డికి బటాయికి ఇవ్వడంతో గొడవలకు దారితీశాయని సామల కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బావిలో పూడిక తీస్తే తమాట, మునగ, నిమ్మ, వంకాయ పంటలు సమృద్ధిగా పంట చేతికొస్తుందని చేసిన అప్పులు తీరుతాయని సామల కరుణాకర్ రెడ్డి ఆశించారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టుగా వ్యవహారం కొనసాగిందని బాధను వ్యక్తం చేశారు. బావి పూడిక తీస్తే భూగర్భ జలాలు ఎక్కువగా ఊరుతాయనే ఉద్దేశ్యంతో సామల మల్లారెడ్డి, సామల మాధవరెడ్డిలు సామల మాణిక్ రెడ్డికి తెలుపకుండా బావిలో పూడికతీత పనులు పూర్తి చేశారు. చెప్పకుండా బావి పూడికతీత పనులు చేపట్టారనే ఆగ్రహంతో సామల మాణిక్ రెడ్డి, అతని కుమారులు పూడిక తీసిన బావిని పూడ్చారని సామల కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పూడిక తీసిన బావిని పూడ్చిన వ్యక్తులపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని సామల కరుణాకర్ రెడ్డి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పూడిక తీసిన బావిని ఎందుకు పూడ్చవలసి వచ్చిందో సామల మాణిక్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగితే నాకు తెలువదు, నాకుమారులకే తెలుసని ముక్తసరి సమాధానం ఇచ్చారు.