ఎనుగు దాడిలో మరో రైతు మృతి
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య 55 గురువారం తెల్లవారుజామున పంట పొలానికి మోటర్ వేయడానికి వెళుతున్న క్రమంలో ఏనుగు దాడి చేసి హతమార్చింది నిన్న చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో రైతు అల్లూరి శంకర్ ను చంపిన విషయం తెలిసిందే దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు అటవిశాఖ అధికారులు త్వరగా ఏనుగును పట్టుకుని తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు