బైండోవర్ ఉల్లంగించిన మహిళను రిమాండ్ కు తరలింపు
అక్షరవిజేత, ముస్తాబాద్
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పల్లెపు రాధిక గతంలో నాటు సారా గుడుంబా అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుపడగా స్థానిక తహసిల్దార్ ముందు ఒక సంవత్సరంకు లక్ష రూపాయలుతో తాసిల్దారు ముందు బైండవర్ చేశారు.మళ్లీ రెండుసార్లు గుడుంబా అమ్ముతూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడగ తాసిల్దార్ నోటీసుకు సమాధానం చెప్పకపోవడంతో తాసిల్దార్ ఆదేశాల మేరకు ఆమెను కరీంనగర్ జైలుకు రిమాండ్ చేశారు ఎవరైనా బైండవర్ ను ఉల్లంఘించిన గుడుంబా నాటు సారా తయారీ అమ్మకం చేసిన చట్టపరమైన చర్యలు ఉంటావని ఎక్సైజ్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.