* బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన యువ నాయకుడు తాండ్ర ప్రవీణ్
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు తాండ్ర ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం యువ నాయకుడు తాండ్ర ప్రవీణ్ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తాండ్ర ప్రవీణ్ కు కాంగ్రెస్ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి తాండ్ర ప్రవీణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు.