చిన్నారి పుష్పాలంకరణ వేడుకల్లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు.
అక్షర విజేత మైలవరం నియోజకవర్గం ప్రతినిధి
మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చిన్నారికి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్నారు.ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దొంతమాల బాబు, బేబీ,కుమార్తె చిన్నారి సింధుకు, పుష్పాలంకరణ వేడుకలు గురువారం ఆయన స్వగృహంలో జరిగాయి.ఈ సందర్భంగా వారి నివాసానికి విచ్చేసిన తెదేపా ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చిన్నారి సింధుని ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.